/rtv/media/media_files/2024/12/13/xudry2NXNQm0g1RG8eH2.jpg)
heart attack
Heart Attack : ఈ మధ్య గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి బాలిక గుండెపోటుతో మృతి చెందింది.
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
గుండెపోటుతో మృతి..
భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గ్యార స్వామి, యాదమ్మ దంపతులకు నవ్య అనే కుమార్తె ఉంది. ఆమె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మంగళవారం స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన నవ్య జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు బుధవారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా, బుధవారం మళ్ళీ జ్వరం రావడంతో బీబీనగర్ లోని మరో ఆస్పత్రిలో చూపించారు.
Also Read : నేను నమ్మలేకపోతున్నా–రష్మిక
అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు జ్వరం బీపీ ఎక్కువగా ఉందని చెప్పడంతో మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!
Also Read : ఎర్రకోట అప్పగించాలని మొఘల్ వారసుల పిటిషన్.. చివరికి