TG crime : సైలెంట్గా మొగుడ్ని లేపేసింది.. పిట్టకు పెడుతుండగా బయటపడ్డ అక్రమసంబంధం!

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగుల‌మందు కలిపి భ‌ర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.

author-image
By Madhukar Vydhyula
New Update
wife killing

wife murdered husband

Murder : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలతో భర్తలను చంపే క్రూరత్వం ఎక్కువైంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, భర్తతో శారీరక సుఖం లేకపోవడం, భర్త మద్యానికి బానిసవ్వడం వంటి కారణాలతో మహిళలు మరోకరితో శారీరక సంబంధాలు నెరపుతున్నారు. ఈ క్రమంలో ఏదో ఒకరోజు ఆ విషయం బయటకు పొక్కి కుటుంబంలో గొడవలకు దారి తీస్తుంది. దీంతో అడ్డుగా ఉన్న భర్తను హత్యచేయడానికి కూడా వారు వెనుకాడటం లేదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.

ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటున్నారా.. విషంతో సమానం

 అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగుల‌మందు కలిపి భ‌ర్తను అంతమొందించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటచెరువుకు చెందిన పుట్టల నరేశ్‌ గతనెల 1న మృతి చెందాడు. కాగా కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అత‌డి త‌ల్లి పుట్టల చుక్కమ్మ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పేటచేరువు స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.

Also Read :  హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే

 కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచార‌ణ‌లో మృతుడు న‌రేశ్ భార్య ర‌జిత‌కు, ఈమె బావ‌ గద్దల సాంబశివరావుకు మ‌ధ్య అక్రమ సంబంధం వెలుగుచూసింది. ఈ నేప‌థ్యంలో త‌న భ‌ర్త పుట్టల నరేశ్‌ అడ్డు తోలగించుకోవాలని రజిత, సాంబశివరావు ఇద్దరూ కలిసి పథకం ర‌చించారు. స్నేహితుడు తాటి నరేశ్‌ సహాయంతో ముందస్తు పథకం ప్రకారం పుట్టల నరేశ్‌ కు మద్యం బాటిల్ లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. ఆ మ‌ద్యం తాగిన ర‌జిత భ‌ర్త అస్వస్థతకు గురై చ‌నిపోయాడు. అయితే నరేష్‌ తో పాటు అదే మద్యాన్ని సేవించిన పెటచెరువుకు చెందిన బొజ్జా వెంకటేశ్వర్లు ఆరోగ్యం కూడా క్షీణించింది. అయితే అది మద్యం మూలంగానే జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ, అసలు విషయం తెలియడంతో నిందితులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్‌, పుట్టల రజితను పోలీసుల‌కు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Also read :  ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

Also Read :  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment