/rtv/media/media_files/2024/11/22/77o5eISKnGHdpAiAB3Ii.jpg)
KCR: ఎట్టకేలకు కేసీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వెలువడింది. కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) ఈ రోజు విడుదలైంది. ఆ సినిమాలో గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ రోల్ లో నటించినట్లు రాకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు.
KCR (కేశవ చంద్ర రమావత్) చిత్రంలోని..
— Telangana Awaaz (@telanganaawaaz) May 31, 2024
‘తెలంగాణ తేజం’ పాటను ఆవిష్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం అందించిన చరణ్ అర్జున్
సింగర్ విహ ఆలపించిన ఈ పాటకు లిరిక్స్ అందించిన సంజయ్ మహేష్
#KCR #KeshavaChandraRamavath #RockingRakesh… pic.twitter.com/ekUw59igCF
పార్టీలకు అతీతంగా చేసిన సినిమా..
ఈ మేరకు సినిమా విడుదలను పురష్కరించుకుని మీడియాతో మాట్లాడిన ఈ సినిమా హీరో రాకింగ్ రాకేశ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఈ సినిమాను పార్టీలకు అతీతంగా తెరకెక్కించారు దర్శకుడు ‘గరుడవేగ’ అంజి. మూవీ టైటిల్ పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించాను. ఇది వరంగల్ నేపథ్యంలో సాగే కథ. బంజారా కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు వాళ్ల ఊర్లో జరుగుతున్న ఒక దారుణాన్ని తనకు తెలిసీ తెలియని వయసులో భుజాన వేసుకుని.. దాన్ని పరిష్కరించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. మరి ఈ ప్రయాణంలో ఇక్కడ తనకెదురైన సవాళ్లేంటి? ఇక్కడ తనేం సంపాదించాడు? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో తనని ఎవరు కలిశారు? ఆఖరికి తన ఊరి సమస్యను పరిష్కరించి ఎలా హీరో అయ్యాడన్నది చిత్ర ప్రధాన కథాంశం. దీన్ని అందరూ ‘బలగం’తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సినిమాకు దానికీ ఎలాంటి పోలిక లేదు’ అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం!
ఇక ఈ మూవీలో తాను కేసీఆర్ అభిమానిగా హీరో కేశవ చంద్ర రమావత్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్లుగా ఈ చిత్రానికి షార్ట్‌కట్‌లో ‘కేసీఆర్’ పేరు పెట్టామని, ఇందులో కేసీఆర్ కూడా నటించినట్లు చెప్పాడు రాకేశ్. కేసీఆర్ కు తెలియకుండా ఆయనను పెట్టి ఈ సినిమా తీశామని, ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరాడు.
ఇది కూడా చదవండి: TG: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు!
Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!
వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets
అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు చేసి.. వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అంటున్నారు. ఇటీవలే గుజరాత్‌లో అఘోరీతో ఉన్న వర్షిణీని ఆమె అన్నయ్యలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణీ ఫ్యామిలీని RTV ఛానెల్ సంప్రదించగా.. వారు అఘోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అఘోరీకి డబ్బులు
ముఖ్యంగా అఘోరీకి డబ్బులు ఎలా వస్తున్నాయి?.. ఎంత వస్తున్నాయి?.. ఆమెకు ఆస్తులు ఉన్నాయా? లేదా? అనే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అఘోరీ తమకు చెప్పిందని వారు అన్నారు. ఈ మేరకు వర్షిణీ పేరెంట్స్ మాట్లాడుతూ.. తాను స్మశానంలో పూజలు చేస్తానని.. మినిమం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనని అఘోరీ చెప్పిందని అన్నారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ప్రభాస్ ఇంటి పక్కన విల్లా
ఆ పూజలు కేవలం బడా బడా వ్యక్తులకే చేస్తానని.. చిన్న చిన్న వారికి చేయనని అఘోరీ చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్‌లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉందని కూడా ఆమె చెప్పిందని.. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని కూడా అఘోరీ వారితో చెప్పినట్లు వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)