తాత KCRతో కలిసి హిమాన్షు పొలం పనులు.. పార పట్టుకుని.. వీడియో వైరల్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తాతతో కలిసి ఫామ్ హౌజ్ లో మొక్కను నాటారు హిమాన్షు. 'Learning from the best' అంటూ ఆ వీడియోకు ఆయన క్యాప్షన్ ఇచ్చారు.

author-image
By Nikhil
New Update
Kalavakuntla Himanshu in KCR Farm House

Kalavakuntla Himanshu in KCR Farm House

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఫామ్ హౌజ్ లో తాత కేసీఆర్ తో కలిసి ఉన్న వీడియోను ఆయన షేర్  చేశారు. మొక్క నాటి నీరు పోసినట్లుగా ఆ వీడియోలో ఉంది. హిమాన్షుకు కేసీఆర్ సూచనలు ఇస్తున్నారు. 'Learning from the best' అంటూ ఆ వీడియోకు ఆయన క్యాప్షన్ ఇచ్చారు హిమాన్షు. వాతావరణ మార్పులతో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడానికి మొక్కలను నాటాలన్నారు. సహజవనరులను రక్షించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ఫోన్ లాక్కున్న ఈడీ!

ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్..

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమైన విషయం తెలిసిందే. కాలు విరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయన ఫామ్ హౌజ్ దాటి బయటకు వచ్చారు. ముఖ్య నాయకులు కూడా ఫామ్ హౌజ్ కు వెళ్లే కేసీఆర్ ను కలుస్తున్నారు. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెనే వెళ్లి తండ్రి కేసీఆర్ ను కలిశారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!

ఇటీవల ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ తర్వాత కేటీఆరే వెళ్లి కేసీఆర్ ను కలిసి... పరిస్థితులను వివరించారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇటీవల సెలవులపై ఆయన ఇండియాకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాతను కలవడానికి ఫామ్ హౌజ్ కు వెళ్లారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు