/rtv/media/media_files/2026/04/26/kavitha-2026-04-26-20-31-25.jpg)
టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS’ అంటూ పోస్టు పెట్టారు. ఆమె చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. కవిత చేసిన ఈ పోస్టు బీఆర్ఎస్ కౌంటర్ గానే పెట్టారని తెలుస్తోంది. శనివారం మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా కవిత ప్రకటించారు. ఆమె పార్టీ ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఓరిజనల్ ఓరిజనలే కాపీ కాపీనే అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకే కవిత ఈ పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది.
TRS ✊🏼
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 26, 2026
Your time is done, our time is now.#TRSpic.twitter.com/sYTe3cZoRQ
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
గతంలో కేసీఆర్ తన టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కవిత మళ్ళీ అదే టీఆర్‌ఎస్ పేరుతో రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. స్వయానా తండ్రి పార్టీకే సవాల్ విసిరేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేపుతున్నాయి.
మరోవైపు కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటించడమే కాకుండా, తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చేశారు. జెండా రంగు దాదాపు గులాబీ రంగును పోలి ఉండటంతో, బీఆర్ఎస్ శ్రేణులు దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, బీఆర్ఎస్ కీలక నేతలు కవిత నిర్ణయంపై ఇంకా మౌనంగానే ఉన్నారు, కానీ అంతర్గతంగా మాత్రం ఇది పెద్ద చర్చకు దారితీసింది.
Follow Us