BIG BREAKING: కవిత కొత్త పార్టీ TRSగా నామకరణం.. అయిదు కీలక హామీలు

కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్రకటించారు. 

New Update
Kavita

Kavita

జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్రకటించారు. మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద నిర్వహించిన సభలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఆమె పార్టీ పేరు ప్రకటించగానే అక్కడికి వచ్చిన కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరు టీఆర్‌ఎస్‌గానే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనే వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్‌.. పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా. తాజాగా ఇప్పుడు కవిత తన కొత్త పార్టీ పేరు టీఆర్‌ఎస్‌గా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 

 కొత్త పార్టీ పేరు ప్రకటించిన సందర్భంగా కవిత మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించాను. ఈ ఉద్యమానికి జాగృతి బలమైన సాంస్కృతిక పునాది వేసింది. బతుకమ్మ వచ్చిన తర్వాత మన సంస్కృతి మనకు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది.ఆనాడు పాలించిన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో నేను సిగ్గుపడుతున్నాను. తెలంగాణ కలలన్నీ ఇంకా సాకారం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ముక్కలయ్యింది. తెలంగాణ ఆత్మను బీఆర్‌ఎస్‌ కోల్పోయింది.  రాష్ట్ర ప్రజలకు ఒక అమ్మగా పరిణితి చెందాలనకుంటున్నా. ఉద్యమంలో బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా తిరిగాను.

బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు. మెడ మీద తలకాయ లేని ఓ వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్‌ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏ కష్టమొచ్చిన ఆ సారు రారు.. ఎందుకంటే ఆయన మారిపోయారు. ఆయన గుంటనక్కల చేతిలో ఇరుక్కున్న మనిషి. మన కేసీఆర్‌ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఉండేవారు. ఆయన రాజకీయ పరిణితి కోల్పోయారు. ఇళ్లను కూలుస్తుంటే ఆదుకోవాల్సిన కేసీఆర్‌ ఎక్కడున్నారు. పదేళ్లలో రూ.లక్ష 89 వేలు ఖర్చు చేసి 18 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు.

రాష్ట్రంలో కర్కోకటుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో చిన్నారులు చనిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదు. మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధుప్రీతిలో నిండిపోయాయి. ఇప్పుడు మన పార్టీయే ప్రధాన ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారం మనదే. ఐదు అంశాలపైనే నా పోరాటం.

1. విద్య: మేము అధికారంలోకి వస్తే అందరికి ఉచిత విద్య అందస్తాం. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఫ్రీగా అందిస్తాం.

2. వైద్యం: ఏ రోగమైన రానీ, ఏ ఆస్పత్రైన సరే ఉచితంగా వైద్యం అందిస్తాం.

3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.

4. ఉపాధి: యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందిస్తాం. సింగిల్ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.  5. సామాజిక న్యాయం: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని'' కవిత ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు