DK Shivakumar: హైదరాబాద్ లో డీకే శివకుమార్.. ఆ బీఆర్ఎస్ కీలక నేత ఇంట్లో ఫంక్షన్ కు?

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిన్నహైదరాబాద్ కు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. వ్యక్తిగత పరిచయాల నేపథ్యంలోనే ఆయన ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

New Update
DK Shiva Kumar Madhu Yashki

DK Shiva Kumar Madhu Yashki

దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహ రిసెప్షన్ నిన్న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత పరిచయాల కారణంగానే ఆయన ఈ వివాహానికి హాజరయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వేడుకకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏపీ కాంగ్రెస్  చీఫ్‌ వైఎస్ షర్మిల, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే ఎన్. ఏ.హరీష్‌ తదితరులు సైతం హాజరయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttam Kumar Reddy: సన్నబియ్యం పంపిణీలో తేడా జరిగితే.. ఉత్తమ్ హెచ్చరిక

సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఏదైనా తేడా జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.

New Update
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీపై సమీక్షించారు. లబ్ధిదారుల ఇళ్లల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని సూచించారు. 

Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...

శ్రీరామనవమి రోజున భద్రాచంలో ఓ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండొద్దని చెప్పారు. ఏదైనా తేడా జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజాప్రతినిధులందరూ రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు. 

Also Read: కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!

ఇదిలాఉండగా ఇటీవల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో దీన్ని ప్రారంభించారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని సీఎస్‌ శాంతి కుమారి పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.  

Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

 telugu-news | rtv-news | uttam-kumar

Advertisment
Advertisment
Advertisment