హుజూరాబాద్ లో రేవంత్ జనజాతర సభ-LIVE
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ సైతం బీజేపీ గూటికి చేరారు. ఆయన కూడా కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో సాగు, తాగు నీరు.. కరెంట్ కష్టాలు. వడ్లకు బోనస్. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు. నెక్ట్స్ సీఎం కోమటిరెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు. ఎమ్మెల్యేల జంపింగ్. కాంగ్రెస్ కూలిపోబోతుంది నిజమేనా? వంటి సంచలన విషయాలపై Rtvతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫేస్ టూ ఫేస్.
TG: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా? లేదా బీజేపీకి చెందిన ఎంపీనా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాముడు అందరికి దేవుడే అని అన్నారు. రాముడిని దేశానికి తామే పరిచయం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
TG: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు బండి సంజయ్. అలా నిరూపిస్తే కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.
TG: ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని అన్నారు కేటీఆర్. జగన్ గెలవబోతున్నారని తమ దగ్గర పక్కా సమాచారం ఉందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనే అంటూ విమర్శించారు. స్వార్థ రాజకీయాలకోసం సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయొద్దని కోరారు.