Lady Aghori: సనాతనధర్మాన్ని కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధం అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ మళ్ళీ తిరిగొచ్చింది. నిన్న కరీంనగర్ లో ప్రత్యక్షమైన ఈ లేడీ అఘోరీ నాగసాధువు మరో శపథం చేసింది. ఫిబ్రవరి 3న తాను వేములవాడ వెళ్తున్నానని, అక్కడ దేవాలయంలో ఉన్న దర్గాను కూల్చేవరకు తన పోరాటం ఆగదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా
అఘోరీపై దాడి
ఈ క్రమంలో ఈరోజు తనపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అఘోరీ. కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా తనపై దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. లక్సెట్‌పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
నేనే కూల్చేస్తా..
అయితే నిన్న కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన అఘోరీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడటంతో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనన్నారు. ఈ విషయంపై తన గురువులతో మాట్లాడినట్టు తెలిపింది. మసీదును తానే స్వయంగా కూల్చేస్తానని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో తను ముందుంటానన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే సహించనని తేల్చి చెప్పారు. ఎక్కడైతే అధర్మం తిష్ట వేసుకుంటుందో అక్కడ తను ప్రత్యక్షమవుతానని, అ ధర్మాన్ని అంతం చేసేంతరకు పోరాడుతానని అఘోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
ఇది కూడా చూడండి: Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!