కరీంనగర్‌లో పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం.. 20 మందికి గాయాలు

ఎమ్మెల్సీ పోలింగ్ విధుల నిర్వహించిన సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. కరీంనగర్, జగిత్యాల హైవేపై గంగాధర రైల్వే గేటు వద్ద అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్‌ను ఢీ కొట్టింది. దీంతో 20 మంది సిబ్బందికి గాయాలైయ్యాయి.

New Update
election road accident

election road accident Photograph: (election road accident)

ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ నిర్వహించుకొని తిరిగి వస్తున్న బస్సు గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లాకు చెందిన బైంసా డిపో బస్ TS 09Z 8084 బస్ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ల సామాగ్రితో పాటు సిబ్బంది కరీంనగర్ వచ్చి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఎలక్షన్ సామాగ్రి కరీంనగర్‌లో అప్పగించేందుకు వచ్చిన బస్సు అదుపు తప్పి సిబ్బందికి తీవ్ర గాయాలైయ్యాయి. 

Also read: rape in Gwalior: ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు.. ఐదేళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర రైల్వే గేటు వద్ద ఈ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 20 మంది సిబ్బందికి గాయాలైయ్యాయి. వారిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also read : AP Budget 2025-26: బడ్జెట్‌లో లోకేశ్ శాఖకు నిధుల వరద.. ఎన్ని వేల కోట్లంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు