/rtv/media/media_files/2025/03/04/YEqT0X0NnXhIlkguUPdD.webp)
kalpana suicide attempt
kalpana suicide attempt : సింగర్ కల్పన నిన్న కేపీహెచ్ బీలోని తన నివాసంలో అచేతనంగా పడిఉన్నారు. పోలీసులు వచ్చి ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అందరు కూడా సింగర్ కల్పన ఆత్మహత్యయత్నంకు పాల్పడిందని భావించారు. తొలుత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందని భావించారు. మరికొందరు కూతురు ఆమెమాట వినకపొవడం వల్ల సూసైడ్ కు ప్రయత్నించిందని అందరు భావించారు. కానీ సింగర్ కల్పన తాజాగా.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన తల్లి ఆస్పత్రి పాలు కావడానికి గల కారణాలపై అసలు నిజం బైటపెట్టారు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
తన తల్లి ఇటీవల మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకొవడం వల్లనే ఈ విధంగా జరిగిందని కల్పన కూతురు అన్నారు. తన తల్లి హైదరబాద్ లో ఎల్ ఎల్ బి, పీహెచ్ డీ చేస్తున్నారని, ఇమ్ సోమ్నియాతో ఒత్తిడికి గురౌతున్నారని అన్నారు. అయితే.. వైద్యులు కొన్ని ట్యాబ్లెట్ లను తమ తల్లికి ఇచ్చారని.. కానీ ఆమె మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నారని చెప్పింది. అందు వల్లనే ఇదంతా జరిగిందని ఆమె అన్నారు. తన తల్లి సూసైడ్ కు ప్రయత్నించారన్న వార్తలలో నిజంలేదని సింగర్ కల్పన కూతురు కొట్టిపారేశారు. దయచేసి ఇలాంటివి వైరల్ చేయడం మానుకొవాలన్నారు. ప్లీజ్.. తన కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవని అందరం బాగానే ఉన్నామని.. దయచేసి కల్పితమైన కథనాలు ప్రచురించవద్దని సింగర్ కల్పన మీడియా ముఖంగా అందరిని కోరారు.
Also read : Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
ఈ క్రమంలో సింగర్ కల్పన సైతం.. తాను సూసైడ్ కు యత్నించిలేదని చెప్పారు. కేవలం తన కూతురుతో వచ్చిన కొన్ని మనస్పర్థల వల్ల మాత్రమే నిద్ర మాత్రలు మింగానని అన్నారు. అయితే.. డోస్ ఎక్కువగా కావడం వల్ల అపస్మారకస్థితిలోకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్ బీ పోలీసులు ఇప్పటికే ప్రెస్ నోట్ ను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
పోలీసుల వివరాల ప్రకారం.. సింగర్ కల్పనా రాఘవేంద్ర గత 5 ఏండ్లుగా తన భర్త ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఒక విల్లాలో నివసిస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఆమె కుమార్తె కు, కల్పనకి, ప్రసాద్‌కి చదువు విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలోనే కల్పన ఒత్తిడికి గురి అయ్యింది. అయితే ఈ విషయం జరిగిన అనంతరం కల్పన హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. అయితే కల్పన హైదరాబాద్‌కి వచ్చిన అనంతరం ఆమె భర్త ఫోన్ చేయగా.. కల్పన నుంచి స్పందన లేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన కల్పన ఉంటున్న ఆపార్ట్‌మెంట్ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే ఆపార్ట్‌మెంట్ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే కల్పన ఉన్న ప్లాట్ దగ్గరికి వచ్చిన పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే తాళం తెరుచుకోకపోవడంతో.. వెనుక వైపు ఉన్న కిచెన్ బాల్కానీ నుంచి లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also read: singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్