Kaleshwaram commission: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో రెండు నెలలు

కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం పై న్యాయ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Kaleshwaram commission

Kaleshwaram commission

Kaleshwaram commission : కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, లోపాలు,అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తికాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయగా ఏప్రిల్‌ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!
 
ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలను విచారించిన కమిషన్‌.. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది. కాంట్రాక్ట్​ఏజెన్సీలు, సబ్​  కాంట్రాక్ట్ సంస్థలూ విచారణకు రావాల్సి ఉండడంతో మరోసారి గడువు పొడిగించారు.

ఇది కూడా చదవండి: Fire Accident: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు
 
రెండుసార్లు పొడిగింపు..


కాళేశ్వరం కమిషన్​ గడువును ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తొలుత జూన్​ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ టైంలోగా నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండడం, ప్రాజెక్టులో చాలా వరకు సాంకేతికాంశాలు ముడిపడి ఉండడంతో విచారణ పూర్తి కాలేదు. తొలుత 60 మంది వరకు రిటైర్డ్, ప్రస్తుత ఇంజనీర్లను పిలిచిన కమిషన్.. వారి నుంచి వివరాలు సేకరించి అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఆ విచారణను కొనసాగించాల్సి రావడంతో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. దీంతో రెండో దశలో రిటైర్డ్​ ఐఏఎస్​లను కమిషన్ విచారణకు పిలిచింది. అప్పటికే టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్​ రిపోర్టు రెడీ కాకపోవడం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆలస్యమవడం వంటి కారణాలతో గడువును అక్టోబర్​ 31 వరకు పొడిగించారు. ఈ దశలో ఓపెన్​ కోర్టు ద్వారా దాదాపు 30 మంది అధికారులను కమిషన్ విచారించింది. ఐఏఎస్​లు పలు డాక్యుమెంట్లను సమర్పించకపోవడం, వారిని ఓపెన్​ కోర్టులో విచారించాల్సి ఉండడంతో మరోసారి గడువును పొడిగించాల్సి వచ్చింది.

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు