ఆ పని చేస్తున్నావని వీడియో తీస్తాం.. నగల వ్యాపారికి బ్లాక్ మెయిల్! కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాప్రాలోని నగల వ్యాపారి గుడివాడ రమణ్‌లాల్ అన్నారు. రత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేస్తూ తనపై వీడియోలు రూపొందిస్తామని బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By Seetha Ram 20 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి నేటి కాలంలో కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈజీ మనీకి అలవాటు పడి పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులు దోచేస్తున్నారు. ముఖ్యంగా స్కామర్లు సంపన్నులనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొట్టేసే పనిలో ఉంటారు. అయితే తాజాగా అలాంటిదే జరిగింది. అయితే అది స్కామర్లు చేయలేదు. యూట్యూబర్లు చేశారు. అది స్కాం కాదు.. దోపిడీ అని చెప్పాలి. ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఓ నగల వ్యాపారిపై ముగ్గురు యూట్యూబర్లు కన్నేశారు. అతడి నుంచి డబ్బులు గుంజుదామని అనుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. అతడి వద్దకు వెళ్లారు. ఓ విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని.. వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. ఆపై ఆ నగల వ్యాపారి నుంచి లక్షల్లో డబ్బును గుంజుకున్నారు. అయితే యూట్యూబర్ల ఆశ అంతటితో ఆగలేదు. మరోసారి మరికొన్ని లక్షలు అడగడంతో నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! కాప్రాలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన నగల వ్యాపారి గుడివాడ రమన్లాల్ గత 30 ఏళ్లుగా బంగారం, రత్నాల వ్యాపారం చేస్తున్నాడు. దీంతోపాటు ఏఎస్ రావు నగర్లో అదృష్ణ జువల్లర్స్ పేరిట ఓ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే ఆగస్టు 3వ తేదీన హిందూ ఛానల్స్ ప్రతినిధులమంటూ డీ శివప్రసాద్ (భారత్ వర్ష), లలిత కుమార్ (హిందూ జనశక్తి), హరికృష్ణ (ఏది నిజం) ముగ్గురు యూట్యూబర్లు నగల వ్యాపారి గుడివాడ రమన్లాల్ను కలిసారు. ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు! మరో రూ.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ రత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేసి తనపై వీడియోలు తీస్తామని గట్టిగా బెదిరించారు. బెదిరిపోయిన నగల వ్యాపారి ఆ ముగ్గురికి రూ.1.50 లక్షల వరకు ఇచ్చానని చెప్పాడు. అయితే వారు మళ్లీ సెప్టెంబర్ 23న రూ.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు. దీంతో వారి వేధింపులు తాళలేక కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు తన నుంచి వసూలు చేసిన రూ.1.50 లక్షలు తిరిగి ఇప్పించాలని.. వాటిని ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్న హిందుత్వ సంస్థలకు అప్పగిస్తానని ఆ నగల వ్యాపారి రమణ్‌లాల్ తెలిపారు. ఇక అందుకు సంబంధించిన వివరాలను రమణ్‌లాల్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. #telangana-news #jewellery #blackmailed #youtubers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి