Raj Pakala: ఫామ్‌హౌస్‌ పార్టీ రచ్చ.. రాజ్‌ పాకాలకు నోటీసులు!

జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ లో పార్టీ, పోలీసుల దాడుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ ముందు హాజరుకావాలని రాజ్ పాకాలకు పోలీసులు జారీ చేశారు. మరో వైపు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

author-image
By Nikhil
New Update
Raj Pakala Arrest krt

తెలంగాణలో నిన్న మొదలైన  ఫామ్‌హౌస్‌ పార్టీ రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు తమ ఎదుట హాజరుకావాలంటూ మోకిల పోలీసుల ఈ నోటీసులను ఇచ్చారు. అయితే.. రాజ్‌ పాకాల అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. మరోవైపు ఈ వ్యవహారంలో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై లంచ్‌ తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టనున్నారు.

Also Read :  ఖమేనీ ఎక్స్ అకౌంట్ సస్పెండ్.. వార్నింగ్ ఇవ్వడమే కారణమా?

శనివారం రాత్రి మొదలైన రచ్చ..

శనివారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ పై పోలీసులు దాడులు చేశారు. అక్కడ రేవ్ పార్టీ నిర్వహించారంటూ వార్తలు రావడం సంచలనంగా మారాయి. దీంతో పాటు ఓ ప్రముఖ నాయకుడికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సాగింది. ఈ విషయంపై డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేశారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల నివాసాల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు సోదాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపాలన్నారు.

Also Read :  కదులుతున్న రైలులో భారీ మంటలు!

కుట్రలతో గొంతు నొక్కలేరన్న కేటీఆర్..

కేటీఆర్ సైతం ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటుంటే రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. కుట్ర ఆ పార్టీలో వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు అన్ని వయస్సు వారు ఉన్నారన్నారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులే చెప్పారన్నారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. 

Also Read :  శ్రీశైలంలో పెద్దపులి భక్తులకు షాక్!

Also Read :  హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు

Advertisment
Advertisment
తాజా కథనాలు