/rtv/media/media_files/2025/03/24/pg02Pj2CXlQzQGSZ2jFY.jpg)
Family planning
Telangana Economic Survey : దేశంలో కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశ పెట్టిన కుటుంబనియంత్రణ పద్ధతులను దక్షిణాది రాష్ట్రాలు విరివిగా ప్రచారం చేశాయి. దాని మూలంగా ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన నేషనల్ హెల్త్ సెమినార్ సదస్సులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలపై ప్రశంసలు లభించినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే చాలామంది కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీల కంటే కండోమ్ లు వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. ఈ విషయాలన్నింటిని ప్రభుత్వం 2024–2025 సోషియో ఎకానమీ బుక్ లెట్ లో పొందుపరిచింది.
Also Read: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్యారోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వారంలో ఒక రోజు ప్రాథమిక ఆరోగ్య స్థాయి కేంద్రం పరిధిలోని జంటలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎంత మంది పిల్లల్ని కనాలి? ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? ఫస్ట్ బేబీ నుంచి సెకండ్ బేబీ గ్యాప్ ఎంత ఉండాలి? పునరుత్పత్తి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల పరిధిలోని ఎమ్ ఎల్ హెచ్ పీలు, ఆశాలు, ఏఎన్ ఎంలు చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఏఎన్ ఎంలు, 37 వేల మంది ఆశా వర్కర్లు కుటుంబ నియంత్రణపై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమర్ధవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలనుకునే జంటలకు మెడికల్ ఆఫీసర్ స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రెండు మూడు దఫాల చర్చల అనంతరం, కుటుంబ సభ్యుల సమ్మతంతో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీలు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబ నియంత్రణ కోసం ఎక్కువ మంది కండోమ్‌లు వినియోగిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడైంది. ఫ్యామిలీ ప్లానింగ్ లో భాగంగా 1,35,713 మంది కండోమ్ లు వినియోగిస్తున్నట్లు సోషియో ఎకానమీ సర్వేలో పేర్కొన్నారు. ఇక 1,10,016 మంది పిల్స్ వినియోగించారు. అంతేగాక మరో 13,676 మంది అంత్రా ఇంజక్షన్స్ వాడగా, 67,464 మంది మహిళలు ట్యూబెక్టమీ, 1006 మంది పురుషులకు వ్యాసెక్టమీ స్టెరిలైజేషన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీలు, నిర్ణయాలు వలన టోటల్ ఫెర్టిలిటి రేట్(టీఎఫ్ఆర్ తగ్గినట్లు సోషియో ఎకనామీ సర్వేలో వెల్లడించారు. ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంత మంది పిల్లల్ని కంటున్నారనేది టీఎఫ్ఆర్ లో లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో టీఎఫ్ఆర్ 2.0 ఉండగా, తెలంగాణ లో 1.5 ఉన్నట్లు శాంపిల్ రీసెర్చ్ సర్వే 2020 రిపోర్టు ప్రకారం వెల్లడించారు.
Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్