/rtv/media/media_files/2026/02/20/parliament-2026-02-20-18-41-02.jpg)
parliament
Rajya Sabha : త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ కి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం , తెలంగాణ లో రెండు స్థానాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 37 స్థానాలకు త్వరలో ఎన్నిక జరగనుంది. అయితే తెలంగాణ లో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలు ఏ పార్టీ కి దక్కనున్నాయి.. ఈ రెండు సీట్ల కోసం ఎవరు పోటీ పడుతున్నారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ నుంచి ఎంపీ లుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి , అభిషేక్ సింఘ్వీ ల పదవి కాలం ఎప్రిల్ లో ముగియనుంది ..ఆ లోపే కొత్త వారి ఎన్నిక పక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 26 నుంచి నామినేషన్ లు స్వీకరించనున్నారు.. మార్చి 16 పోలింగ్ జరగనుంది.
రెండు స్థానాలు కాంగ్రెస్ కే..?
తెలంగాణ లో ఎన్నిక జరగనున్న రెండు రాజ్యసభ స్థానాలను ఎమ్మెల్యే లు ఎన్నుకొన్నారు... దీంతో ఆయా పార్టీ ల ఎమ్మెల్యే ల బలాబలాలు కీలకంగా మారాయి.. తెలంగాణ లో 119 ఎమ్మెల్యే లు ఉన్నారు.. అందులో అధికార కాంగ్రెస్ కు 66 మంది ఎమ్మెల్యేలు , బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ,ఎంఐఎం కు 7 మంది ,బీజేపీ కి 8 మంది ,సీపీఐ కు ఒక్కరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యే ల మద్దతు అవసరం..ఇద్దరు ఎమ్మెల్యే లు గెలవాలంటే 80 మంది ఎమ్మెల్యే ల సపోర్ట్ అవసరం... అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఒక స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉంది. రెండో స్థానం కోసం ఇతరుల మద్దతు కాంగ్రెస్ కు అవసరం....
ఇక బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యే లు ఉండగా అందులో 9 మంది కాంగ్రెస్ తో కలసి పనిచేస్తున్నారు..దీంతో బీఆర్ఎస్ బలం 28 కి పడిపోయింది.. దీంతో బీఆర్ఎస్ కు కూడా సొంతంగా సీటు గెలిచే బలం లేదు.. అయితే కాంగ్రెస్ తనకు ఉన్న 66 మంది ఎమ్మెల్యేలకు తోడు , సీపీఐ కి చెందిన 1 ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో పనిచేస్తున్న 9 మంది ఎమ్మెల్యేలు కలుపుకుని 76 మంది ఎమ్మెల్యేల మద్దతు అవుతుంది. అయినా ఆ పార్టీ మరోస్థానం గెలవాలంటే మరో నలుగురు ఎమ్మెల్యే ల మద్దతు అవసరం... దీంతో ఎంఐఎం మద్దతు తో రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
పోటీలో పలువురు ఆశావాహులు..
కాంగ్రెస్ లో రాజ్యసభ సీటు ఆశీస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం పదవికాలం ముగుస్తున్న అభిషేక్ సింఘ్వీ కి మరోసారి రెన్యూవల్ చేసే అవకాశం ఉంది.. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా అభిషేక్ సింఘ్వీ పేరు మరోసారి ప్రతిపాదించే అవకాశం ఉంది.. ఇక ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున పోటీ చేసిన తెలంగాణ కు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ అదిష్టానం సుదర్శన్ రెడ్డి కి రాజ్యసభ హామీ ఇచ్చినట్లు గా ప్రచారం జరుగుతోంది.. ఇక మరోనేత వీహెచ్ పేరు చర్చలో ఉంది... మరోనేత సీఎం కు అత్యంత సన్నిహితుడు ,సీఎం సలహాదారు వేం నరెందర్ రెడ్డి పేరు కూడా పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది.. గతంలో వేం నరెందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ప్రయత్నం చేసినా సామాజిక సమీకరణాల వల్ల ఎమ్మెల్సీ రాలేదు.. దీంతో రాజ్యసభ కు వేం ను పంపిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది.. వీరితో పాటు నిజమాబాద్ కు చెందిన ఈరవత్రి అనీల్ , జగిత్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. వీరేకాక ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా డజనుమందికి పైడా నేతలు సీటు ఆశీస్తున్నారు. ఉన్న రెండు స్థానాలకు ఢజను మంది పేర్లు చర్చలో ఉండగా.. ఆశావాహులు మాత్రం తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు.గాంధీ భవన్ లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ కు ఎవరిని పంపిస్తారు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది...
Follow Us