/rtv/media/media_files/2025/03/19/AIXqRxpPVDQ37b5AsvWI.jpg)
Human trafficking
హైదరాబాద్ నగరానికి బతుకుతెరువు కోసం వచ్చే యువతులను కొంతమంది మహిళలు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఉద్యోగాలు, సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చేవారికి ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
డాకయిట్ ఆపరేషన్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు,సరూర్ నగర పోలీసులు నాగమణిని దిల్ షుఖ్ నగర్, కమల నగర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. యువతుల ఫోటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపించి.. వాళ్లకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత లొకేషన్ కన్ఫర్మేషన్ తర్వాత స్వయంగా నాగమణి విటుల వద్దకు తీసుకెళ్తోంది. అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతోంది. ఉపాధి కోసం వచ్చి బలవుతున్న యువతులు, మహిళలు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.
Human Trafficking
సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు ఆమె మోసాలకు పాల్పడుతోంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఎర వేసి సినిమాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతోంది.యువతుల ఫోటోలను వాట్సాప్ ద్వారా విటులకు నాగరాణి పంపుతుంది. దాంతో వారు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటుంది. డబ్బులు వచ్చాక.. లొకేషన్ కన్ఫర్మేషన్ చేస్తున్న తర్వాత నాగరాణి యువతలను స్వయంగా విటులవద్దకు తీసుకువెళుతుంది.
Also Read: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వలపన్ని నాగరాణినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు , సరూర్ నగర్ పోలీసులు డాకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. హలో నాగమణి అంటూ వాట్సాప్‌లో విటుల వలే పోలీసులు మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్ కు అమ్మాయిని తీసుకొని వచ్చింది. సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి బృందం, ఇన్‌స్పెక్టర్ దేవేందర్ బృందం డెకాయిట్ ఆపరేషన్ చేపట్టాయి. అమ్మాయి కావాలని వాట్సప్ ద్వారా నాగమణిని సంప్రదించారు. ఆమె ఓ యువతితో దిల్‌సుఖ్‌నగర్ కమలానగర్‌కు వచ్చి వారితో బేరసారాలు సాగించింది. దీంతో నాగమణితో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దని, నాగమణి లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి యువతులకు సూచించారు.అమీర్‌పేటకు చెందిన నాగమణి సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచారంలోకి దింపుతుందని పోలీసులు నిర్ధారించారు. సినిమాల పేరుతో బలవుతున్న యువతులు, మహిళలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!