IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్‌‌ కుమార్‌‌ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్‌కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. 

New Update
IAS Amoy Kumar

ED Investigation : ఈడీ విచారణకు రెండు రోజు హాజరయ్యారు రంగారెడ్డి  జిల్లా మాజీ కలెక్టర్‌‌‌‌ అమోయ్‌‌ కుమార్‌‌. గత బీఆర్ఎస్ ప్రభుత్వ భయంలో మల్కాజ్ గిరి జిల్లాలో జరిగిన భూ కేటాయింపులలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. ఈడీ జాయింట్‌‌ డైరెక్టర్ రోహిత్‌‌ ఆనంద్‌‌ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ అమోయ్ కుమార్​ను ఈ భూ కేటాయింపులలో జరిగిన అవకతవకలపై విచారిస్తోంది. కాగా మాజీ మంత్రి ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు చివరికి ఎర్రబెల్లితో పాటు కేటీఆర్ కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. 

Also Read :  అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్!

42 ఎకరాలకు వందల కోట్లు...

ఐఏఎస్ అధికారి అమోయ్‌‌ కుమార్‌‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. కాగా భూదాన్‌‌కు చెందిన సర్వే నంబర్ 181లో 50 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండేది. ఈ భూమికి తమది అంటూ.. ఆ భూమికి వారసురాలిని తాను అంటూ గతంలో ఖాదురున్నీసా బేగం అనే ముస్లిం మహిళ సక్సేషన్‌‌కు దరఖాస్తు చేసుకుంది. కాగా ఈ భూమిని  2021లో ఆమె పేరున వివాదాస్పద భూమి రిజిస్టర్  చేశారు అధికారులు.

Also Read :  అల్లు అర్జున్ అభిమానులకు భారీ షాక్ ! ఇక 'పుష్ప' లేనట్లే

కోర్టు కీలక ఆదేశాలు..

ఆ తర్వాత ఆ భూమి ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్‌‌కు అమ్మకం చేశారు. అయితే.. ఇందులో ఎదో అవకతవకలు, అక్రమం జరిగిందంటూ దస్తగిరి షరీఫ్‌‌ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి ప్రభుత్వం సొమ్ముకు గండి పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు...మహేశ్వరం పోలీసులకు కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో మహేశ్వరం మండల మాజీ తహసీల్దార్, సబ్‌‌ రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతితో పాటు ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ ఓనర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

Also Read :  షర్మిల సంచలన నిర్ణయం!

రంగంలోకి ఈడీ...

కాగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌‌‌‌ సహా పెద్ద నేతల హస్తం ఉందని.. అలాగే కొందరు అధికారుల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బు సంచులు అందినట్లు కనుక్కున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు ఆధారంగా రంగంలోకి ఈడీ వచ్చింది. దీనిపై FIR నమోదు చేసింది. ఈ కేసులో కేసుల్లో పేర్కొన్న భూముల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. భూ కేటాయింపుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు లాగేందుకు అమోయ్‌‌ కుమార్‌‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Also Read :  మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్‌! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం

Advertisment
Advertisment
తాజా కథనాలు