Mallu Bhatti Vikramarka : పనులు చేయకుండా ప్రచారం చేసుకోలేదు...పల్లాపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలా పనులు చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకోవలసిన అవసరం తమకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మేము తప్పుడు సమాచారం ఇస్తున్నామంటున్నారని, మీలాగా ఆరేండ్లు పెండింగ్‌లో పెట్టకుండా 3 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామన్నారు.

New Update
Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలా పనులు చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకోవలసిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మేము తప్పుడు సమాచారం ఇస్తున్నామంటున్నారని, మీలాగా ఆరేండ్లు పెండింగ్‌లో పెట్టకుండా మూడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రశ్నలకు భట్టి ఘాటుగా సమాధానమిచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో 2018లో బీఆర్ఎస్ హయాంలో ఐదేండ్లలో రూ. 124 కోట్లు రుణమాఫీ చేస్తే.. మా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే రూ.263 కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. గజ్వేల్ లో  బీఆర్‌ఎస్‌ రూ.104.3 కోట్ల రుణమాఫీ చేస్తే..తాము రూ.237.33 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ- రూ.96.62 కోట్లు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.177.91 కోట్లు మాఫీ చేసిందన్నా రు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.101.76 కోట్ల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్‌ రూ. 175.84 కోట్ల రుణమాఫీ చేసిందని వివరించారు. శాసనసభ ప్రాంగణంలోనూ రైతు రుణమాఫీ, రైతు భరోసా కు సంబంధించిన సమాచారం డిస్‌ప్లే చేస్తామని భట్టి తెలిపారు.ప్రతి సంక్షేమ పథకం వివరాలు లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు ఇస్తాం..గ్రామాల వారీగా ఫ్లెక్సీ లపై డిస్‌ప్లే చేస్తామన్నారు. రైతు రుణమాఫీ మాత్రమే కాదు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి స్కీంకు సంబంధించిన వివరాలు లెక్కల తో సహా ఇస్తామని భట్టి అన్నారు.

ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్సిటీలను గాలికి వదిలేస్తే మేము 12 మంది వీసీలను నియమించాం.సమాజంలో వెనుకబడిన వర్గాలను సైతం తీసుకున్నాం.. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి మా ప్రభుత్వం ఒక దళితుల్ని వీసీ గా నియమించింది.. నగరం నడిబడ్డన ఉన్న మహిళ యూనివర్సిటీకి మీరు ఎప్పుడైనా వెళ్లారా .. మేము యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి.. కలియతిరిగి పాత వారసత్వ భవనాల మరమ్మతుకు వెంటనే రూ15 కోట్లు విడుదల చేశామన్నారు. ఇవి కాకుండా రూ. 540 కోట్లు బిల్డింగులు కట్టడానికి వెంటనే ఆదేశాలు ఇచ్చాం. ఇది బంధం..  మా అనుబంధం.. ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వ కమిట్మెంట్ అన్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నా భూతో న భవిష్యత్. 20 ఎకరాల్లో డిజిటల్ బోర్డులు, క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాలు, బోధన సిబ్బంది అక్కడే ఉండేలా నిర్మాణాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయలేదు. మేము ఒక్కో స్కూలు రూ.200 కోట్లతో నిర్మిస్తున్నాం. ఇది మా సీఎం కమిట్మెంట్, ఎస్సీ ,బీసీ, ఎస్టీ వర్గాల విద్యారంగంపై మా ప్రభుత్వ కమిట్మెంట్ ఇది. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించి.. మహేంద్ర& మహేంద్ర వంటి పారిశ్రామికవేత్తలను పిలిచి వారికి కావాల్సిన నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించి రిక్రూట్మెంట్ కు అవకాశాలు కల్పిస్తున్నాము. పరిశ్రమలకు అవసరమైన  నిపుణులను అందించేందుకు 65. ITI లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లుగా తీర్చిదిద్దుతున్నామని భట్టి వివరించారు.

ఇది కూడా చదవండి: విత్తనాలే కదా అని విసిరి పారేస్తున్నారా..ఈ విషయం తెలిస్తే ఏరుకుని మరీ తెచ్చుకుంటారు

ముఖ్యమంత్రికి సమయం లేదు విద్యాశాఖను పట్టించుకోవడం లేదనడం సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి విద్యా శాఖకు చేస్తున్న సేవలు చూసి గర్విస్తున్నామన్నారు.. మీ సీఎం లాగానే మా సీఎం కూడా ఉండాలని ఊహించుకుంటే ఎట్లా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం, మరో ఆరువేల ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాము.. 22,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. మీరు పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిన విద్యాశాఖలో 36,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసాం. మీరు ఒక యూనివర్సిటీ, ఆయనకు ఒక యూనివర్సిటీ ధారా దత్తం చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు లబ్ది జరగద్దు అనేది మీ ఆలోచన, రాష్ట్ర ఖజానా మీలాంటి రాజకీయ నాయకుల కోసం కాదు... పైసా పైసా జమ చేస్తాం పేదలకు పంచుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: BRS Leaders: MLAపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment