/rtv/media/media_files/2025/03/04/zv73G4jXxWpDkFqVkeEY.jpg)
HYDRAA demolitions in Hyderabad..
HYDRAA : హైదరాబాద్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. నిజాంపేటలో రహదారి ఆక్రమణల తొలగించింది.దీంతో ఏడెనిమిది కాలనీలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగాయి. నిజాంపేట మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 12లోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ రహదారుల ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. రహదులను ఆక్రమించిన స్థానికులు అపార్ట్మెంట్ ర్యాంపులు, రోడ్డు మీదకు జరిగి మొక్కలకోసం ఫెన్సింగ్ లతో పాటు.. పై అంతస్తులకు చేరేందుకు ఐరన్ ఫ్రేమ్ మెట్ల ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ కాలనీలో రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు, అదనంగా గదులు నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
వెంకటరాయనగర్, బాలాజీ కాలనీ, కేఎన్ ఆర్ కాలనీ, కొలను తులసి రెడ్డి (కేటీఆర్) కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. ఓల్డ్ ఏజ్ హోం నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కు నిజాంపేట రహదారుల మీదుగా వెళ్లే వాహనాలతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఉదయం, సాయంత్రం వేళ పాఠశాల మినీ బస్సులు, అత్యవసర వాహనాలు కూడా తిరగలేని దుస్థితిపై బాలాజీ హిల్స్ కాలనీవాసుల ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించామని.. తొలగించడానికి కోర్టు తీర్పు ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ స్థానికుల ఆరోపించారు.
Also Read: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్!
ఆక్రమణలు తొలగించాలంటూ రెండు నెలలు గడువు ఇచ్చినా.. ఫలితం లేకపోవడంతో నిజాంపేట మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా చర్యలు చేపట్టింది. రోడ్డుమీదకు వచ్చిన కట్టడాలు, దుకాణాలు, ఫెన్సింగ్‌ల తొలగించింది. బాలాజీ హిల్స్ కాలనీలోని పలు రహదారుల తో పాటు అక్కడ ఇందిరమ్మ కాలనీ దారుల్లో కూడా కబ్జాలను తొలగించింది. బాలాజీహిల్స్ కాలనీతో పాటు.. నిజాంపేట మున్సిపాలిటీ 12వ వార్డు నివాసితులు హైడ్రా కూల్చివేతలకు సహకరించారు. రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడం, అదనంగా గదులు నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఇందిరమ్మ కాలనీ వాసులకు చెప్పిన అధికారులు వాటిని తొలగించారు.'
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
కిలోమీటరుకు పైగా ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆక్రమణల తొలగింపుతో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మెట్రో రైలుతో పాటు.ప్రధాన రహదారికి సులభంగాచేరుకునే అవకాశం లభించందంటూ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన
నిజాంపేటలో రహదారి ఆక్రమణల తొలగింపు
— HYDRAA (@Comm_HYDRAA) March 4, 2025
ఏడెనిమిది కాలనీలకు తొలగిన ట్రాఫిక్ ఇబ్బందులు
🔶నిజాంపేట మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 12లోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ రహదారుల ఆక్రమణలను మంగళవారం తొలగించిన హైడ్రా.
🔶 రహదులను ఆక్రమించి అపార్ట్మెంట్ ర్యాంపులు, రోడ్డు మీదకు జరిగి… pic.twitter.com/NeNOlpBMBP