Hydra: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్‌ కీలక ప్రకటన

TG: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్‌ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు.

New Update

Hydra: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. భారీ ఎత్తున కూల్చివేతలన్న ప్రచారం కరెక్ట్ కాదని అన్నారు. కొందరు రాజకీయ లబ్ది కోసమే సొసం మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: హరికేన్‌ విధ్వంసం..30 మంది మృతి!

VIDEO:

హైడ్రా భయంతో మహిళా మృతి!

హైద‌రాబాద్ లో చాలా చోట్ల హైడ్రా (Hydra) కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ (Buchchamma)  అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇంటిని కానుకగా ఇచ్చారు. 

అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ (FTL) ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ కూతుళ్లకు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు