Hyderabad : బిగ్ షాక్.. ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఛార్జీలు పెంచేశారు బాబోయ్!

వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుపై టోల్‌ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
orr-charge

orr-charge

వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుపై టోల్‌ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఛార్జీలు రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది. ఇక మినీ బస్‌, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు.

Also read :  UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

2 యాక్సిల్‌ బస్సులకు కిలో మీటర్ కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు కిలో మీటర్ కు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్‌బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది.  అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఏడాది టోల్ ఛార్జీలను పెంచుకునే అవకాశం ఉంది.  

 ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్ గా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి.  అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి. ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశమేగానే పేర్కొనవచ్చు.  

Also Read :  వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్

Aslo read :  Hyderabad : తల్లితో అక్రమ సంబంధం..ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Duvvada: ఏ క్షణమైనా నా రాజాను చంపేస్తారు.. అందుకే కరెంట్ కట్ చేసారు: మాధురి సంచలనం!

ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. అతన్ని ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. ఇటీవలే గన్‌మెన్‌ను తొలగించడం, బిల్ కట్టినా తన ఇంటి కరెంట్ కట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

New Update
madhuru dv

Divvela Madhuri

Duvvada: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. అయితే తాజాగా తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ మాధురి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తాము ఇద్దరం వెంకన్న సన్నిధిలో ఒక్కటయ్యామని, ప్రస్తుతం చాలా కంఫర్టుగా ఉన్నామని మాధురి చెప్పింది.

ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్లాన్..

ఈ నేపథ్యంలోనే దువ్వాడను ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాపోయింది. అతడిని హతమార్చేందుకే తమ ఇంటి కరెంట్ కట్ చేసారని చెప్పింది. బిళ్లు చెల్లించిన తర్వాత కనెక్షన్ కట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రమాదం పొంచి వుందని తెలిసినా ప్రభుత్వం గన్ మెన్ ను తొలగించడపం అనుమానం వ్యక్తం చేసింది. ఏపీలో ఉంటే తమను బతకనివ్వరని, అందుకే తెలంగాణలోని హైదరాబాద్ లో షో రూం ఓపెన్ చేసినట్లు మాధురి వివరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరింది. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

ఇదిలా ఉంటే.. విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ విడాకులు మంజూరు కాగానే.. తాము వివాహం చేసుకుంటామని ఇప్పటికే వీరు అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి ఇటీవలే ఈ జంట హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణం కూడా వీరు ప్రారంభించారు. ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి

duvvada-srinivas | divvala madhuri | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment