Telangana: 2008 తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. 2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నట్టు విద్యాశాఖ నోట్ రిలీజ్ చేసింది. పాత జిల్లాల ప్రకారం వెరిఫికేషన్, విల్లింగ్ ఫామ్ ఇవ్వాలని చెప్పింది. By Manogna alamuru 24 Sep 2024 | నవీకరించబడింది పై 24 Sep 2024 23:09 IST in హైదరాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Government: డీఎస్సీ 2008 బాధిత అభ్యర్ధులకు ఎట్టకేలకు మరో అకాశం లభించింది. కాంట్రాక్ట్ ప్రతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులను సమర్పింంచాలని.. పాత జిల్లాల ప్రకారం వెరిఫికేషన్, విల్లింగ్ ఫామ్ ఇవ్వాలని చెప్పింది. అభ్యర్థులు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది విద్యాశాఖ. దీనికి సబంధించి 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది. ప్రస్తుతం తెలంఆణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరనుంది. దాంతో పాటూ డీఎస్సీ అభ్యర్థుల 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి