Telangana: ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తారని ప్రభుత్వం చెప్పింది.

New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

Telangana Government: 

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. వీరికి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని స్పెషల్‌ ఆఫీసర్లను సర్కారు ఆదేశించింది. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి చెప్పారు. దాంతో పాటూ హైదరాబాద్‌ జిల్లా బాధ్యతలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమప్రాలికి అప్పగించారు. 

అధికారులు...

ఆదిలాబాద్ - ఇలంబర్తి
కరీంనగర్ - ఆర్.వి.కర్ణన్
నల్గొండ - అనిత రామచంద్రన్
నిజామాబాద్ - ఎ.శరత్
రంగారెడ్డి - డి.దివ్య
మహబూబ్‌నగర్‌ - రవి
వరంగల్ - టి.వినయ్ కృష్ణారెడ్డి
మెదక్ - హరిచందన
ఖమ్మం - సురేంద్ర మోహన్
హైదరాబాద్ - ఆమ్రపాలి.. ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.

Also Read: నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు