Hyderabad : మతం మారమని హింసించి.. మత్తు మందు ఇచ్చి తమ్ముళ్లతోనే... RTVతో బాధితురాలు సంచలన విషయాలు!

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి, మతం మారినట్లు నాటకమాడి ఒక యువతి జీవితాన్ని నాశనం చేసిన లవ్ జిహాద్ ఉదంతం బయటపడింది.

New Update
love jihad

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి, మతం మారినట్లు నాటకమాడి ఒక యువతి జీవితాన్ని నాశనం చేసిన లవ్ జిహాద్ ఉదంతం బయటపడింది. బాధితురాలు ఆవేదనతో ఆర్‌టీవీ (RTV)కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తనపై జరిగిన అఘాయిత్యాలను వివరించింది. అద్దె ఇంటి కోసం వచ్చిన నవాజ్ అనే వ్యక్తి, ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చివరకు నరకం చూపించాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది.

ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్

తొలుత తాను హిందువుగా మారానంటూ నమ్మబలికిన నవాజ్ తనను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడని వెల్లడించింది. గత ఏడాది జూలై 28న తమ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని తెలిపింది.  అయితే పెళ్లికి ముందే ఆమె నుంచి సుమారు 16.5 లక్షల రూపాయలు వసూలు చేసిన నవాజ్, పెళ్లి తర్వాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడని బాధితురాలు వెల్లడించింది.  పెళ్లి జరిగిన రోజు నుంచే నవాజ్ కుటుంబ సభ్యులు ఆమెను శారీరకంగా వేధించడం మొదలుపెట్టారని వెల్లడించింది. పెళ్లి రోజే తన తమ్ముళ్లతో కలిసి నవాజ్ తనపై అఘాయిత్యానికి పాల్పడారని ఆరోపించింది. ఎదురుతిరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా మత్తు మందు ఇచ్చేవారని ఆరోపించింది.

నవాజ్ కుటుంబం ఆమెను ముస్లిం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమెకు చెందిన 12 తులాల బంగారం, స్థలాన్ని కూడా అమ్మేశారని తెలిపారు.  అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లు, ఐప్యాడ్స్‌ కూడా వాడుకున్నారు. ఒకానొక దశలో నవాజ్ అక్క మాట్లాడుతూ, 'ట్రిపుల్ తలాక్' చెప్పాక వేరే పురుషుల వద్దకు వెళ్లాలని, అది తమ మత సంప్రదాయమని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. నిరాకరించినందుకు తనను దారుణంగా కొట్టడం, బట్టలు చింపి హింసించడం వంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించేందుకు కూడా ప్రయత్నించారని ఆమె వాపోయింది.

ఈ ఏడాది జనవరి 16 నుంచి నవాజ్ అదృశ్యం కాగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే కూకట్‌పల్లి పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం మిస్సింగ్‌ కేసుగా మాత్రమే నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మార్చి నెలలో నవాజ్ మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చి తనను భయపెట్టాడని, పోలీసులు రెండు నెలల నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆమె తెలిపింది. నాలాగా మరే అమ్మాయి మోసపోకూడదు, నాకు న్యాయం జరగాలి అంటూ బాధితురాలు  పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు