/rtv/media/media_files/2025/04/08/lZLRkGtmo051b7PjzqUM.jpg)
Samshabad Rajiv Gandhi Air port
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఇప్పటికే ఎన్నో రికార్డును కొల్లగొట్టింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త రికార్డ్ ను సృష్టించి దేశంలోని విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి న్యూ రికార్డ్ నెలకొల్పింది. లాస్ట్ ఇయర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. చివరి మూడు నెల్లో అయితే ఏకంగా 74 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇది మరో రికార్డ్. ఈ రద్దీ ఇలానే కొనసాగితే వచ్చే ఏడాదికి ఈ సంఖ్య మూడు కోట్లు దాటుతుందని ఎయిర్ పోర్ట్ అథారిటీ చెబుతోంది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా.. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషమని అధికారులు గర్వంగా చెబుతున్నారు. ఈ విషయంలో కోలకత్తా, చెన్నై, బెంగళూరులను హైదారబాద్ దాటేసింది. అలాగే రోజువారీ గరిష్ట సంఖ్య 75 వేలను కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జనవరి 18న అధిగమించింది. ఈ ఒక్క రోజే 94 వేలమంది ప్రయాణించారని తెలిపారు.
డొమస్టిక్, అంతర్జాతీయం అన్నీ..
హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడి నుంచి దుబాయ్, దోహా, అబుదాబి సహా అమెరికా వంటి విదేశాలకు వెళ్ళేవారు ఎక్కువగానే ఉంటున్నారు. దుబాయ్ కు నెలకు 93 వేల మంది, దోహాకు 42 వేల మంది, అబుధాబీకి 38 వేలు, జెడ్డాకు 31 వేలు, సింగపూర్‌కు 31 వేల మంది ప్రయాణిస్తున్నారని విమానాశ్రయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచే విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. దాంతో పాటూ హైదరాబాద్‌లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వలన కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.
today-latest-news-in-telugu | air-port | samshabad | rajiv-gandhi-airport