Telangana: కేటీఆర్, హరీష్ రావులపై కేసు నమోదు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుల మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మంత్రి కొండా సురేఖ ఫోటోలపై వీరిద్దరూ ట్రోలింగ్ చేస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘనందన్ రావు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 03 Oct 2024 in హైదరాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Police Case On KTR, Harish Rao: కేటీఆర్, కొండా సురేఖ మధ్య వార్ ఎక్కడా తగ్గడం లేదు. కేటీఆర్ మీదకొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా దుమారం రేపాయి. దాంట్లో నాగ చైతన్య–సమంతల పేర్లు తీసుకురావడంతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మరోవైపు కేటీఆర్ కూడా మంత్రి సురేఖ కు ధీఉగానే సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో దాడి చేశారు. అయితే ఈ నేథ్యంలో తాజాగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఎంపీ ఫిర్యాదులో చెప్పారు. వీరితో పాటూ మరికొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు నమోదు చేశారు. Also Read: ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడి..భారత్‌కు పొంచి ఉన్న ముప్పు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి