అక్టోబర్ లో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ

అక్టోబర్ నెలలో కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల పరిమితి..పట్టణ ప్రాంతలలో 7.5 ఏకారల మెట్ట భూముల ఉన్న వారికి కార్డులు జారీ చేస్తామని చెప్పారు.

New Update
Uttam Kumar : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

White Ration Cards: కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీపై జలసౌద లో మంత్రివర్గ ఉపసంఘం భేటి అయింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటూ రాష్ట్ర రెవిన్యూ, సమాచారశాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,పి.యు.సి చైర్మన్ కే.శంకరయ్య, శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తదితరులు హాజరయ్యారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీకి అక్టోబర్ నెలలో ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ నెలఖారుకి మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించిన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజ నరసింహా, రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం నియమించింది.

కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ అంశంపై ఇప్పటికే మూడుమార్లు వివిధ కోణాలలో అధ్యయనం జరిపిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం ఎర్రంమంజిల్ కాలనీ లోని జలసౌద లో నాలుగోసారీ సమావేశం అయ్యారు.
మంత్రివర్గ నిర్ణయం అనంతరం అక్టోబర్ నెలలో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా మంజూరీ చేసిన తెల్ల రేషన్ కార్డులు అతి స్వల్పమని ఆయన గణాంకాలతో సహా వివరించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చెయ్యాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. అవిగాక జాతీయ ఆహార భద్రత కార్డులు 54.45 ఉండగా ఆ కార్డులకు ఐదు కేజిల బియ్యం కేంద్రం అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేజీ అందిస్తుందన్నారు.అదే విదంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 35.51 లక్షల కార్డులకు మొత్తం బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఉత్తమ్ వివరించారు. ఇవి గాక అంత్యోదయ కార్డులు 5.66 లక్షలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరికి విధి విధానాలు రూపొందించేందుకు వీలుగా నేడు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో లక్షా 50 వేలు ఉండగా పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల లోబడి ఆదాయంగా ఉందన్నారు. రాష్ట్రంలో తెల్లకార్జుల జారీకి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు తరి మూడున్నర ఎకరాల పరిమితిని విధించగా..పట్టణ ప్రాంతలలో 7.5 ఏకారల మెట్ట భూముల ఉన్న వారికి ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఆయన చెప్పారు. అదే విదంగా రాష్ట్రంలోని ప్రతీ చౌక ధరల దుకాణాలలో జనవరి నెల నుండి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Also Read: Hyderabad: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

 

Advertisment
Advertisment
తాజా కథనాలు