/rtv/media/media_files/2025/04/07/d1XeyFq1j6PG6ZejD6Z2.jpeg)
lady aghori villa
Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ హాట్ టాపిక్‌గా మారింది. వందల కోట్ల ఆస్తులు, జూబ్లీహిల్స్ లో ప్రభాస్ ఇంటి పక్కన ఉన్న విల్లా, కార్లో లక్షల క్యాష్ వంటి ఆరోపణలకు అఘోరీ స్పందించింది. అఘోరీ మాత కారులో లక్షల్లో క్యాష్ ఉంటుందని శ్రీవర్షిణీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అఘోరీకి జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి దగ్గర ప్రభాస్ ఇంటి పక్కనే రూ.10 కోట్ల విలువచేసే విల్లా కూడా ఉందని వారు చెబుతున్నారు.
Also Read: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది
వర్షిణీ ఇంట్లో పూజలు చేస్తున్న సమయంలో ఆ విల్లాను వారికి ఇచ్చేస్తానని కూడా అఘోరీ చెప్పినట్లు వర్షిణీ తల్లి తెలిపారు. అలాగే అఘోరీ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇంట్లో పూజలు చేస్తారని వారు ఆర్టీవీతో చెప్పారు. ఈ ఆరోపణలకు అన్నింటికీ క్లారిటీ ఇవ్వడానికి లేడీ అఘోరి RTVతో మాట్లాడింది.
విల్లాపై అఘోరీ క్లారిటీ..
ప్రభాస్ ఇంటి పక్కనున్న విల్లా తనది కాదని అఘోరీ చెప్పింది. శ్రీవర్షిణీ తల్లిదండ్రులు చెబుతున్నవి పూర్తిగా అసత్యాలని ఆమె ఖండించింది. యుట్యూబర్లు ఎవరైనా అఘోరీ విల్లా అని అటుగా వెళ్తే ఆ ఇంటి యజమానులు వారిని కొడతారని అఘోరీ చెప్పింది. భిక్షాటన చేస్తూ ఉండే నా కార్లో లక్షల రూపాయల క్యాష్ ఎలా ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను పూజలు మాత్రమే చేస్తానని వందల కోట్ల ఆస్తులు లేవని అఘోరి క్లారిటీ ఇచ్చింది. శ్రీవర్షిణీ తల్లిదండ్రులు ఆమె గురించి చెప్పిన విషయాల్లో కేవలం పూజలు చేయడం మాత్రమే నిజమని అఘోరి ఆర్టీవీతో చెప్పుకొచ్చారు.
Also Read: Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!
Also Read: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్!