రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర రేపు ఉదయం 7గంటలకు ప్రారంభం అవనుంది. మధ్యాహ్నం క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్‌ గణపతి చేర్చి..2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో 64చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

New Update
hyderabad

Maha Ganapathi Shobha Yatra: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం అవనుంది. కొద్దిసేటి క్రితం 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేయనున్నారు. తర్వాత ఈరోజే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్‌పైకి మహా గణపతి ఎక్కిస్తారు. రేపు మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌‌లో ఉన్న క్రేన్‌ దగ్గరికి ఖైరతాబాద్‌ గణపతి చేరుస్తారు. మొత్తం 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు రేపు నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నాయి.రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. రేపంతా సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్‌ లేదని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. అలాగే రేపు తాగేసి నిమజ్జానికి వచ్చి రచ్చ రచ్చ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు సీపీ. 

Also Read: Tripura: పాకిస్తాన్..క్యాన్సర్ లాంటిది..మళ్ళీ నోరు పారేసుకున్న యోగి ఆదిత్యనాథ్

Advertisment
Advertisment
తాజా కథనాలు