JANAWADA: జన్వాడ పార్టీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది మహిళలు, 22 మంది పురుషులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి యూరిన్‌ టెస్టులో కొకైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

New Update
ds dd

JANAWADA: జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం రాత్రి 11:30 నిమిషాలకు ఫామ్‌ హౌస్‌కు చేరుకున్న పోలీసులు.. మహిళలు, పురుషులు వేర్వేరుగా రెండు బృందాలు కూర్చొని మద్యం సేవిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే పోలీసులను చూడగానే పారిపోయేందుకు పలువురు ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే 16 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Nag Ashwin: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్

ఫామ్‌హౌజ్‌లో కొకైన్..

పురుషులకు డ్రగ్ శాంపిల్‌ కిట్‌ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహించగా వారిలో విజయ్‌ మద్దూరి యూరిన్‌ టెస్టులో కొకైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. డ్రగ్ శాంపిల్ కిట్‌తో టెస్టుకు మహిళలు నిరాకరించాగా.. పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరిని ప్రత్యేకంగా విచారించారు. విజయ్ తన వెంట కొకైన్ తెచ్చుకున్నాడా? లేక ఫామ్‌హౌజ్‌లో ఉందా? అనే కోణంలో విచారించి.. రాజ్‌పాకాల సూచన మేరకే విజయ్ డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి!

పాకాల కంపెనీకి విజయ్ సీఈవో..

ఇక పాకాల రాజేంద్రప్రసాద్‌కు ETG పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉండగా.. ఆ కంపెనీకి విజయ్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయ్‌ మద్దూరికి  సొంతంగా  FUSION AIX పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది. ఐదేళ్లుగా విజయ్ మద్దూరి, పాకాల రాజేంద్రప్రసాద్ మధ్య స్నేహం కొనసాగుతుండగా.. కొత్త ఇంట్లో దీపావళి పార్టీకి రావాలని విజయ్‌ను ఆహ్వానించాడు పాకాల రాజ్‌. దీంతో రాజ్‌ సూచనతోనే విజయ్ మద్దూరి కొకైన్ సేవించినట్లు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అలాగే పెద్ద ఎత్తున ప్లయింగ్ కార్డులను గుర్తించిన పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు పలు విలువైన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.  

ఇది కూడా చదవండి: అప్పుడు దూకుడు..ఇప్పుడు ఆగుడు.. HYDRA 100 డేస్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే!

ఇది కూడా చదవండి: Revanth Reddy: మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి-VIDEO

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment