BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. నల్లగొండ నుంచి ECIL వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update

Hyderabad Accident:

ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర డివైడర్‌ని ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో పసికందుకు గాయాలు అయ్యాయి. చిన్నారి తల్లే ఆ మృతురాలుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్లగొండ నుంచి ECIL వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు