HYD METRO : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రాత్రి 1వరకు మెట్రో సేవలు!

గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17 నిమజ్జనం రోజున రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు HMRL MD ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని ఆయన కోరారు.

author-image
By srinivas
New Update
hyd

HYD Metro

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17)న అర్ధరాత్రి 1 వరకూ మెట్రో సర్వీసులు నడపనున్నట్ల తెలిపారు. ఈ మేరకు అన్ని మెట్రో లైన్లలో సెప్టెంబర్ 18న 1AM వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని HMRL MD NVS రెడ్డి సూచించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణీలు వారి గమ్యస్థానాలకు చేరుకోనుండగా.. ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో పోలీసులు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ మేరకు ఎన్వీఎస్ రెడ్డ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ముగిసేవరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు నడపుతాం. డిమాండ్‌కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. రెండు వారాలుగా మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రతిరోజూ 5 లక్షల ప్రయాణిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను సుమారు 94వేల మంది వచ్చినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Elevator accident : హైదరాబాద్ లో మరో లిప్టు ప్రమాదం...ఒకరి మృతి

హైదరాబాద్‌ నగరంలోని సూరారంలో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్‌మెట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

New Update
Elevator accident

Elevator accident

Elevator accident :హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.నగరంలోని సూరారంలో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్‌మెట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!


ఇదిలా ఉండగా.. ఇటీవల అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 15న చోటు చేసుకుంది. దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్‌ బహదూర్‌ నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్‌ బహదూర్‌ కుటుంబం ఉంటోంది. రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్‌ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు