ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 31 వరకు ఈ ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. 

New Update

HYD Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు మరో శుభవార్త అందించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2025 మార్చి 31 వరకు ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. 

సూపర్ సేవర్ ఆఫర్-59
ఈ ఆఫర్ తో సెలవు రోజుల్లో  కేవలం రూ.59తో ఒకరోజు మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. 

స్టూడెంట్ పాస్: 
విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చు.

సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: 
రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లపై (సీఎస్‎సీలు) 10% తగ్గింపు ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్  ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు.

New Update
Waqf Amendement Bill

Waqf Amendement Bill

Waqf Amendement Bill : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్  ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు ఆరోపించారు. వక్స్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దశల వారిగా నిరసన చేపడతామని వారు హెచ్చరించారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment