అటకెక్కిన మెట్రో కోచ్‌ల పెంపు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు! హైదరాబాద్ మెట్రో కోచ్ ల పెంపు కలగానే మిగిలింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గతేడాది మరో 3 కోచ్ లు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసాధ్యం అంటూ మెట్రో యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. By srinivas 06 Nov 2024 | నవీకరించబడింది పై 06 Nov 2024 15:26 IST in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి HYD Metro: హైదరాబాద్ మెట్రో కోచ్ ల పెంపు అటకెక్కింది. ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించినప్పటికీ ఇంతవరకూ ఉలుకు పలుకు లేకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పిస్తామని చెప్పినప్పటికీ ఇందులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది.. ప్రస్తుతం రాయదుర్గం–నాగోల్, మియాపూర్–ఎల్‌బీనగర్, జేబీఎస్-ఎంజీబీఎస్ ఈ మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఇవి రోజు 1,065 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. సెలవు దినాల్లో రద్దీ కారణంగా దాదాపు 5.10 లక్షల వరకు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక 2017 మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కోట్ల మంది వినియోగించుకున్నారని, అందుకు అనుగుణంగానే ట్రిప్పులు పెంచినట్లు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Trump-Modi: ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! ప్రయాణికుల పడిగాపులు.. కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ తగ్గటంలేదు. రోజు 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్‌వేర్, ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సకాలంలో ఆఫీసులకు చేరలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కోచ్ లను పెంచి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ఇది కూడా చదవండి: America Precident: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్ 2.o! ఇదిలా ఉంటే.. మెట్రోకు భారీగా నష్టాలొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త కోచ్‌ల కొనుగోలుకు సుమారు రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని, 59 రైళ్లకు 3 చొప్పున కొంటే రూ.500 కోట్లు కావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం అంటున్నారు. #hyderabad-metro #9-coaches మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి