/rtv/media/media_files/2024/12/14/Q3SddWzdOOun0K0cybpF.jpg)
hot water bag1
Hyderabad : ఆరోజు రాత్రి 8 గంటల సమయం కావొస్తుంది. అప్పుడే నాన్నకు తీవ్రమైన నడుము నొప్పి మొదలైంది. దీంతో నాన్న కాస్త ఉపశమనం కోసం బ్యాక్ పై హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకొని పడుకున్నాడు. కానీ అదే వాటర్ బ్యాగ్ తన కొడుకును బలి తీసుకుంటుందని ఊహించలేకపోయాడు. అవును.. మీరు విన్నది నిజమే ..! హాట్ వాటర్ బ్యాగ్ పేలి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విధారకమైన ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది.
Also Read : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
హాట్ వాటర్ బ్యాగ్ పేలడంతో..
మచ్చబొల్లారం గోపాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే ఓ ప్రైవేటు ఉధ్యోగికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అతని పేరు దేవాన్ష్. అయితే కొన్నేళ్లుగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న ఆనంద్ కి వైద్యులు హాట్ వాటర్ బ్యాక్ చికిత్స సూచించారు. కాగా, ఈనెల 8న ఆనంద్ కి బ్యాక్ పెయిన్ రావడంతో హాట్ వాటర్ బ్యాక్ వీపు పై పెట్టుకొని బోర్లా పడుకున్నాడు. ఆ సమయంలో ఆడుతూ అక్కడికి వచ్చిన దేవాన్ష్ నాన్న అంటూ.. తండ్రి పై దూకాడు. ఈ క్రమంలో నేరుగా దేవాన్ష్ హాట్ వాటర్ బ్యాగ్ పై బలంగా పడడంతో అది పగిలిపోయింది. దీంతో దానిలోని వేడి నీళ్లు దేవాన్ష్ పై పడడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానిక అస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ దేవాన్ష్ మృతి చెందాడు.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
ఇంట్లో తరచూ వాడే వాటర్ హీటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. అవే మీ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిలిస్తాయి.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు