HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం...ఇంకా అదుపులోకి రాని మంటలు

హైదరాబాద్‌లో జీడిమెట్ల పారిశ్రామిక ఏరియాలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్‌వీ ప్లాస్టిక్ పరిశ్రలో అంటుకున్న మంటలు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. దట్టమైనపొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 

New Update
11

జీడిమెట్లలోని ఎసెస్వీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం రానురాను ఎక్కువ అవుతోంది మంటలను అదుపులోకి రావడం లేదు. 7 ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్‌ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంతకీ అదుపులోకి రావడం లేదు. మొదట మూడ అంతస్తులో చెలరేగిన మంటలు...కింద వరకూ వ్యాపించాయి. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగించే ముడి సరుకు ఉంది. ఇది మంటలను మరింత వ్యాపింపచేసేలా మారింది. దీంతో ఎంత ప్రయత్నించినా...మంటలను అదపులోకి తీసుకురాలేకపోతున్నారు. 

కూలిపోయే పరిస్థితిలో భవనం..

అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పరిశ్రమ భవనం కూలిపోయే స్థితికి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి రావకపోవడంతో దూలపల్లి రోడ్డులో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

Also Read: Rahul:రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం

Advertisment
Advertisment
తాజా కథనాలు