/rtv/media/media_files/2025/02/23/6mOqMAfaNhDjBgWG16QF.jpg)
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ జనాల మీద గట్టిగానే పడింది. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో కనీసం కోడిని కాదు కదా కోడి గుడ్డును కూడా తినడం మానేశారు. అమ్మో చికెన్ తింటే ఏమవుతుందో ఏమో.. బర్డ్ ఫ్లూ వైరస్ తమకు కూడా వ్యాపిస్తుందేమో అనే అపోహలో కొంతమంది ఉన్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అలాంటిదేమి జరగదని.. చికెన్, గుడ్లు తింటే ఏం కాదని చెబుతున్నారు.
అయినప్పటికీ జనాల్లో మాత్రం భయం పోవడం లేదు. దీంతో చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు.కొన్నిచోట్ల కేజీ 100-150 మధ్యే చికెన్ లభిస్తుండగా, చాలా ప్రాంతాల్లో కౌ190 వరకూ పలుకుతోంది. హైదరాబాద్ లో 170-190 ఉండగా, సూర్యాపేటలో కౌ150, తుంగతుర్తిలో 170, వరంగల్ లో రూ.180, విజయవాడలో రూ. 180, విజయనగరం, కడపలో రూ.150, అనంతపురంలో రూ. 120, రామచంద్రాపురంలో రూ.200 వరకూ లభిస్తుంది.
కస్టమర్లు రాకపోవడం, సేల్స్ జరగకపోవడంతో అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఇలా అయితే షాపులు మూసుకోవాల్సిందేనని చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు కూడా పడిపోయాయి. దీంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు.
కిలో చేపలు రూ.350
చికెన్ తినడం మానేసిన జనాలు ఇప్పుడు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం కింద రూ. 100 పలికిన కిలో చేపలు ఇప్పుడు ఏకంగా రూ. 350 పలుకుతున్నాయి. రొయ్యలు, పీతలు ధరలు సైతం బాగా పెరిగిపోయాయి. గుండెకు మంచిది కావడం, బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ముఖం చూడిన జనాలు చేపలతోనే పూట గడిపేస్తున్నారు.
Also read : Mastan Sai: 300 కాదు 499 నగ్న వీడియోలు.. మస్తాన్ సాయి కేసులో మరిన్ని భయంకర నిజాలు!
Also Read : suhas : ఎంత పని చేశావ్‌రా నా కొడకా.. సుహాస్ ఎమోషనల్ పోస్ట్