/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Minor-Girl-Rape-Case.jpg)
Hyderabad: తెలంగాణలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమాదారం గ్రామంలో కరెంట్ లైన్ వద్ద సహాయకుడిగా పనిచేసే వెంకట్ రావు (36), మరో ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం వృద్ధురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితులను విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.