హైదరాబద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని కోరుకున్నారు. రాబోయే ఏడాది సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితమని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని గుర్తు చేశారు.
Also read: తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ ఉగాది కనుక.. ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల బెనిఫిట్!
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలని ఆయన అన్నారు. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే మా ప్రభుత్వం విధానమని వివరించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈరోజు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. రవీంద్ర భారతిలో కార్యక్రమం అనంతరం నేరుగా ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో హుజూర్‌నగర్ బయలుదేరారు.
Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?