వినాయక నిమజ్జనంపై సీఎం రేవంత్ సమీక్ష రేపు ఖైరతాబాద్‌లో వినాయకునితో పాటూ ట్విన్ సిటీస్ లో అన్ని గణేష్‌లనూ నిమజ్జనం చేయనున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసింది. గట్టి పోలీస్ బందబస్తును కూడా పెట్టారు. వీటిపై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 16 Sep 2024 in హైదరాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. దీనికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హజరయ్యారు. వీరితో నిమజ్జనం ఏర్పాట్ల గురించి సీఎం చర్చించారు. వివరాలను అడగి తెలుసుకున్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు వివరించారు సీపీ. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సీపీ, ఉన్నతాధికారులను హెచ్చరించారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. Also Read: China: చైనాలో బేబింకా తుఫాను బీభత్సం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి