TS: ఐఏఎస్ ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్‌లు అందరూ తక్షణమే వెళ్ళి ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 

New Update
HMDA: హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి

 GHMC Commissioner Amrapali: 

ఐఏఎస్ ఆమ్రపాలతో పాటూ 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు కేంద్ర దగ్గర నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్‌ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలితో పాటు విద్యుత్‌ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్‌ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు.

ఆమ్రపాలి తన యూపీఎస్సీ అప్లికేషన్‌లో పర్మినెంట్ అడ్రస్ విశాఖది ఇచ్చారు. అందువల్ల ఆమెను ఏపీ కేడర్‌‌కు కేటాయించారు.తనను తెలంగాణ స్థానికురాలిగా
గుర్తించాలని ఆమె కోరిన్పటికీ...ఆ అభ్యర్ధనను ప్రత్యూష్ సిన్హా కమిటీ గతంలోనే తిరస్కరించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున కేంద్రం ఇప్పుడు తాజాగా ఏపీకి వెళ్ళాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఆమ్రపాలి, తెలంగాణ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

2010 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆమ్రపాలి ఐఏఎస్‌‌‌‌‌‌‌‌గా శిక్షణ పూర్తి చేసుకున్నాక తొలుత వికారాబాద్ సబ్‌‌‌‌‌‌ ‌‌కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, తర్వాత కొంతకాలం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జాయింట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ అయ్యారు. తెలంగాణ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌లో జాయింట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. 2020లో ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో కేంద్ర సర్వీసుల్లో జాయిన్ అయి డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర సర్వీసులో చేరారు. హెచ్‌ఎమ్డీ కమిషనర్గా ఆమ్రపాలి పనిచేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ఉన్నారు.

Also Read: Tirumala: దివ్వెల మాధురి మీద కేసు నమోదు

Advertisment
Advertisment
తాజా కథనాలు