/rtv/media/media_files/2025/01/14/SirqffD8f17rWJXJm7GN.jpg)
Kaushik Reddy granted bail Photograph: (Kaushik Reddy granted bail)
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కరీంనగర్‌లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత కౌశిక్‌రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టిపారేశారు.3 కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు. బెయిల్‌పై విడుదలయ్యాక కౌశిక్ రెడ్డి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోయారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హైదరాబాద్ కు వెళ్లాక అక్కడే అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే పోలీసులు జడ్జి వద్దకు తరలించే క్రమంలో మాత్రం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఎన్ని కేసులు పెట్టిన వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం కౌశిక్‌రెడ్డి చేశారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో తనపై కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని.. అక్రమ కేసులకు తాను భయపడే రకం కాదన్నారు కాగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు ఆరెస్ట్ అయ్యారు. హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్‌రావులను గృహనిర్బంధం చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ తో వాగ్వాదం
కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి జరిగిన కార్యక్రమలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం జూబ్లిహీల్స్‌లో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు.హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలించారు. పోలీసుల అరెస్టును కౌశిక్‌రెడ్డి ప్రతిఘటించగా, బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. మొత్తం కౌశిక్ రెడ్డిపై 5 కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ వన్ టౌన్‌లో మూడు కేసులు నమోదు కాగా.. త్రీటౌన్ పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 12 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్లు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు.
Also Read : మస్క్ చేతికి టిక్‌టాక్...అమ్మే ఆలోచనలో చైనా