MLA Raja Singh : మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులందరూ తాను చెప్పినట్లు చేయాలని పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రోజుల తరబడి స్నానం చేయకుండా.. గొడ్డు మాంసం తిని అమ్ముతున్న వాళ్ల దగ్గర మహా శివరాత్రికి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!
ఇదిలా ఉండగా ఆదివారం కూడా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకు షాపులు ఎందుకు కేటాయించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. శ్రీశైలంలో శివ భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో సైతం ముస్లింలకు ఆలయ ప్రాంగణంలో అనేక షాప్ లు కేటాయించారని, అప్పుడు హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయని రాజాసింగ్ గుర్తుచేశారు.
Also Read: ట్రంప్ ప్రభుత్వంపై నిరసన సెగలు.. '50501 ఉద్యమం' పేరిట రోడ్లపైకి జనాలు
ఇటీవల కొందరు శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాపులు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ దేవాలయాల వద్ద ఇతర మతస్తుల షాపులు ఉండకుండా చూడాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కోర్టులు కూడా అదే చెబుతున్నాయన్నారు. అక్కడ ఓ ఫాల్తు లీడర్, ఆలయ ఈవో ముస్లింలకు అండగా ఉంటున్నారని రాజాసింగ్ విమర్శలు చేశారు. పోలీసులు శివ స్వాములపై లాఠీచార్జీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మరోసారి శివ స్వాములపై లాఠీచార్జీ చేసినా, వారిని ఇబ్బంది పెట్టినా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శివ భక్తులమంతా శ్రీశైలం చేరుకుంటామని ఆలయ ఈవో, పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్న వారిని ఎలా పంపాలో తాము చూసుకుంటామన్నారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్
ఇక రాజాసింగ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.తనకు రెండు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ‘ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షా అల్లా. అప్పుడు మీ యోగి, మీ మోడీ కూడా మిమ్మల్ని రక్షించలేరు’ అని హెచ్చరించారని ఆయన తెలిపారు. తనకు +918986512926, తో పాటు +919434154614 నంబర్ల నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెంబర్లను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు.
MLA Raja Singh: హిందువులు వారి వద్దనే పూజ సామాన్లు కొనాలి--రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు
మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
raja singh MLA