BRS Corporators : జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద హైటెన్షన్

హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం శుక్రవారం మరోసారి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గురువారం అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు.దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

New Update
BRS Corporators

BRS Corporators

BRS Corporators : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం శుక్రవారం మరోసారి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గురువారం అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు.దీంతో కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Also Read :  సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్

గురువారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశం లో తమ పార్టీ మహిళా కార్పొరేటర్లపై కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించి దాడిచేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్‌లో తమపై దౌర్జన్యానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టేది లేదని మండిపడ్డారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమె ఏకపక్షంగా ఆమోదించారని తప్పుపట్టారు. బడ్జెట్‌‌పై కౌన్సిల్‌లో చర్చించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా బడ్జెట్ ఆమోదించారంటూ ప్రశ్నించారు. మేయర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

కాగా గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభసా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో గ్రేటర్ వార్షిక బడ్జెట్‌ను మేయర్ ఆమోదించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లను కాంగ్రెస్‌ కార్పొరేటర్లు దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బడ్జెట్‌పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మేయర్ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, సీఎన్‌ రెడ్డి మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరినొకరు తోచుకున్నారు. అయితే మహిళలని చూడకుండా ఫసియుద్దీన్‌ తమపై దాడి చేశాడని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీంతో  కౌన్సిల్‌లోకి ఎంటరైన మార్షల్స్ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మేయర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ తాజాగా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు నగర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు