తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, కామారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Kusuma 23 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, నిజమాబాద్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మరో మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డిలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మియాపూర్, లింగంపల్లి, షేక్ పేట, మెహదీపట్నం, కూకట్‌పల్లి, కొండాపూర్, మాదాపూర్, రాజేంద్రనగర్, టోలీచౌకి, నిజాంపేట్ ఏరియాల్లో వర్షం కురిసింది. ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంటి నుంచి బయటకు ఎవరు రాకుండా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను సూచించింది. #heavy-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి