Telangana MLAs Defection Case : ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..స్పీకర్‌ ముందుకు కడియం

తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ లో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.

New Update
kadiyam (1)

Kadiyam srihari

Telangana MLAs Defection Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ లో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఆయనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్‌ పై స్పీకర్‌ కడియం ను ప్రశ్నించనున్నారు. దీనికోసం  నేడు విచారణకు రావాలని వివేకానందకూ కూడా స్పీకర్ నోటీసులు పంపించారు.
 
గత కొంతకాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న స్పీకర్‌ నేడు కడియం శ్రీహరి వర్సెస్ వివేకానంద కేసును విచారించనున్నారు.ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో విచారణ జరగనుంది.
పిటిషనర్ వివేకానందను  కడియం తరపు న్యాయవాదులు..క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.  మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 8మందిపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. వారిపై పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన తేల్చారు.  కాగా దానం నాగేందర్‌ ను ఇటీవల విచారించిన స్పీకర్‌ నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే దానం మాత్రం తాను బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నానని చెప్పడం గమనార్హం. కడియ శ్రీహరి విచారణ తర్వాత దానం, కడియం పై నిర్ణయాన్ని స్పీకర్‌ వెల్లడించే అవకాశం ఉంది.
  
    కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య తదితరులు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు వీరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని కంప్లైంట్ ఇచ్చారు. అయితే స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.

కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుని ఆ పార్టీ సమావేశాలకు వెళ్లడం, పార్టీ కార్యకలపాల్లో పాల్గొనడం, ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ వారు ఇంకా బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నారని స్పీకర్‌ చెప్పడాన్ని బీఆర్‌ఎస్‌ తప్పుపడుతోంది. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం తలుపు తట్టింది. విచారించిన సుప్రీం స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటాడా లేదాతామే తీసుకోమంటావా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.  ఈ సందర్భంగా మిగిలిన ఇద్దరి విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు