Hanamkonda : భర్తతో విడాకులు ఇప్పిస్తానని నమ్మించి... హన్మకొండ ఎస్ఐ రాసలీలలు!

హన్మకొండ జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగుచూసింది. విడాకులు ఇప్పించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వివాహితను లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఒక పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పై కేసు నమోదైంది.

New Update
si

హన్మకొండ జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగుచూసింది. విడాకులు ఇప్పించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వివాహితను లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఒక పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... తన భర్తతో ఉన్న గొడవల విషయమై సహాయం కోసం ఆమె మొదట హన్మకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. నీకు భర్త నుండి విడాకులు ఇప్పిస్తానని, ఆ తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. తనకు కొడుకు లేడని అబద్ధం చెప్పడమే కాకుండా, తన భార్యకు కూడా విడాకులు ఇచ్చేసి నీతోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆ ఎస్ఐ ఆమెకు ఆశ చూపించాడు.

శారీరక సంబంధం పెట్టుకుని

ఈ క్రమంలో రాజ్‌కుమార్ ఆ మహిళను హన్మకొండలోని ఓయో రూమ్‌లతో పాటు పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి, పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు తెలియకుండా కొన్ని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసి, ఆ తర్వాత వాటిని చూపించి ఆమెను వేధించడం, భయపెట్టడం మొదలుపెట్టాడు. బాధితురాలు తన ఫిర్యాదులో మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాను రెండుసార్లు గర్భం దాల్చినప్పుడు రాజ్‌కుమార్ బలవంతంగా గర్భస్రావం మాత్రలు  మింగించాడని పేర్కొంది. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించేవాడని చెప్పింది. అంతేకాకుండా, పోలీస్ శాఖలోనే ఉద్యోగం చేస్తున్న ఆమె సోదరుడి కెరీర్‌ను నాశనం చేస్తానని కూడా ఎస్ఐ బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

చివరికి బాధితురాలు ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హన్మకొండ పోలీసులు సదరు ఎస్ఐపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు