/rtv/media/media_files/2025/03/01/NVTwUgDk6vk9ZTeHFndk.jpg)
తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ పండుగ సందర్భంగా ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటి పూట బడులు నడవనున్నాయి.
మరోవైపు నెలవంక కనిపించడంతో రేపటి నుంచి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు.
Also read : అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన
Also read : తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్
ఏప్రిల్, మే నెలల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మరోవైపు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికమని పేర్కొంది.
Also Read : ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
ఇక ఏపీలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
Also Read : కేజ్రీవాల్కు ఘోర అవమానం.. ఆప్ కార్యాలయానికి తాళం!