/rtv/media/media_files/2025/01/27/SO1FO9R4UqdX9jNmlOhS.webp)
Inter Student Suicide In Hostel
Student Suicide : హైదరాబాద్ హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. కుంట్లూరు మైనార్టీ గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మైనార్టీ గురుకుల హాస్టల్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన హాస్టల్ సిబ్బంది ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు. మరో వైపు విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా తెలంగాణలో గత కొంతకాలంగా గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థకు గురవుతున్నారు. మరోవైపు ప్రైవేటు కళశాలలకు చెందిన విద్యార్థులు వరసగా ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనంగా మారింది. ఇటీవలె సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన భార్గవి అనే విద్యార్థిని హైదరాబాద్ జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మరవక ముందే సౌమ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.